ఆదోని: నారికి రక్ష దేశ్ కి సురక్ష కార్యక్రమంలో భాగంగా ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు
Adoni, Kurnool | Sep 16, 2025 ఆదోని ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో ప్రిన్సిపాల్ మురళి మోహన్ గారి అధ్యక్షతన "నారి కి రక్ష దేశ్ కి సురక్ష" కార్యక్రమంలో భాగంగా ఆడ బిడ్డను రక్షించుకుందాం భూమిని సంరక్షించుకుందాం అనే నినాదంతో సురక్షితమైన ఆరోగ్య కరమైన ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ వాడకంపై అవగాహన సదస్సు జరిగింది. మంగళవారం వారు మాట్లాడుతూ. RWF సంస్థ, మాస్టర్ ట్రైనర్ Dr. సంధ్య రాణి పాల్గొని ప్రతి రోజు భారత దేశంలో ప్లాస్టిక్ మరియు సింథటిక్ ప్యాడ్స్ వాడటం వల్ల 9999 టన్నుల వ్యర్థం బైటికి వెళ్తుందని ఇవి భూమిలో కలసి పోవు కాబట్టి మన పర్యావరణం, నీరు మరియు మన చుట్టూ ఉన్న జీవచరాలు, ఎంతో ప్రభావితం అవుతుందన్నారు.