పుంగనూరు: ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి.
శుభారాం డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టి. రాజశేఖర్,
చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ సుభారాం డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశులు సూచనలు మేరకు వైస్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జాతీయ ఎయిడ్స్ డే పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్ సోమవారం మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలో మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కోరారు . విద్యార్థినీ విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అనిల్ కుమార్, సోమరాజు, షాహిదాబాను, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.