జగిత్యాల: జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్ లో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా, సందర్శించిన కలెక్టర్
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్ లో మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...రోజురోజుకు సాంకేతికత వేంగంగా విస్తరిస్తోందని అందువల్ల విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు సాంకేతిక విద్య అందించే విధంగా ఉపాధ్యాయులు బోధించాలని అప్పుడే విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణిస్తారని కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు.తరగతి గదులలో విద్యార్థులకు పాఠాలు సులభతరంగా బోధన చేసే విధంగా టిఎల్ఎం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.