పులివెందుల: వేంపల్లి లో బైకులతో స్టంట్స్ చేసిన ఆరు మంది యువకులు అరెస్టు
Pulivendla, YSR | Oct 26, 2025 కడప జిల్లా వేంపల్లిలో రోడ్లపై ప్రమాదకరమైన స్టెంట్లు చేస్తున్న 6 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ఆధారంగా యువకులను అరెస్టు చేసినట్లు వేంపల్లి ఎస్సై తిరుపాల్ నాయక్ చెప్పారు. ఈ సంఘటనల వల్ల ప్రజలకు ప్రమాదకరం కావడంతో పాటు యువతలో పెరుగుతున్న రియల్ పిచ్చితోను చట్టాలను యువత పట్టించుకోవడంలేదని పోలీసులు చెప్పారు. పోలీసులు యువకులను అరెస్టు చేయడంతో పాటు 3  బైకులను స్వాధీనం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు నివారించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.