నగరంలో ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జాయింట్ కలెక్టర్ శివ
Anantapur Urban, Anantapur | Sep 17, 2025
ప్రపంచపు తొలి వాస్తు శిల్పి సృష్టికర్తగా పేరొందిన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని జయంతి వేడుకలు బుధవారం ఉదయం 11 గంటల సమయంలో స్థానిక అనంతపురం నగరం గుత్తి రోడ్డు లోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విశ్వకర్మ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది గురు ప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ , జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.