అసిఫాబాద్: ఆసిఫాబాద్ పెట్రోల్ బంకుల్లో నిబంధనలు గాలికి:DYFI జిల్లా కార్యదర్శి
పెట్రోల్ బంకుల యజమానులు నిబంధనలను గాలికొదిలేశారని,బంకుల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని DYFI జిల్లా కార్యదర్శి దినకర్ అన్నారు. మంగళవారం సాయంత్రం 6గంటలకు ASF,HP పెట్రోల్ బంక్ లో వినియోగదారుల సౌకర్యాలపై దృష్టి సారించడం లేదన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ బంకుల్లో గాలి నింపే యంత్రాలు ఉండాలి. కోరిన ప్రతి వినియోగదారునికి ఉచితంగా గాలి నింపాలి. కానీ బంకు నిర్వాహకులు ఖర్చుతో కూడుకున్న పనిగా భావించి వాటిని ఏర్పాటు చేయడం లేదు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసినా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం లేదని ఆరోపించారు.