భూపాలపల్లి: యూరియా కోసం ఉదయం 3 గంటల నుంచి పిఎసిఎస్ కార్యాలయం వద్ద రైతుల పడిగాపులు
భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయం వద్ద సోమవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి యూరియా కోసం రైతులు వేచి చూస్తున్నారు.ఈ నేపథ్యంలో నిర్వాహకులు మాత్రం 200 మందికి టోకెన్లు ఇచ్చి 200 మందికి యూరియా ఇస్తాం అనడంతో రైతులు ఒక్కసారిగా కార్యాలయం ముందు నిరసనకు దిగారు వేల మంది రైతులు వచ్చినప్పటికీ 200 మందికి యూరియా ఇస్తానడం ఎంతవరకు సమంజసమని వెంటనే ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని రైతులు సోమవారం ఉదయం 7 గంటలకు మాట్లాడుతూ డిమాండ్ చేశారు.