భూపాలపల్లి: గ్రామపంచాయతీ కార్మికుడు మృతి, అండగా నిలిచిన అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని కొంపల్లి లో పసుల పచ్చయ్య అనే పంచాయితీ కార్మికుడు మృతి చెందాడు. గ్రామ పంచాయితీ నుండి దహన సంస్కారాల నిమిత్తం 10000 రూ: ఎంపీడీఓ నాగరాజు చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పెంచాల లింగయ్య ,కారొబార్ దేవేందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.