అమరచింత: అమరచింత పీహెచ్‌సీలో అన్ని సౌకర్యాలతో హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర రాజనర్సింహ
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పర్యటన సందర్భంగా సాయంత్రం 6 గంటలకు వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత మండలంలో పర్యటించి దేశాయి మురళీధర్ రెడ్డి స్మారకార్థం వారి కుమారుడు ప్రకాష్ రెడ్డి నిర్మించిన భవనంలో నడుస్తున్న హెల్త్ సబ్ సెంటర్ ను జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి, స్థానిక శాసన సభ్యులు వాకిటి శ్రీహరి, దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.