దర్శి: సాగర్ జలాల సరఫరా కొనసాగించాలని రైతులు విజ్ఞప్తి
ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతంలోని సాగర్ జలాల పెద్ద కాలువలో నీటి ప్రవాహం దాదాపు ఆగిపోయినట్లుగా రైతులు తెలిపారు. కాలువలో సాగర్ జలాలు అతి తక్కువగా కనిపించడంతో ఏమి జరిగిందో అంటూ రైతులు సందేహం వ్యక్తం చేశారు. తుపాన్ భారీ వర్షం వల్ల కాలువకు నీటి విడుదల పూర్తిగా తగ్గించారని ప్రచారం జరుగుతున్నట్లుగా రైతుల తెలిపారు. ఏదేమైనా సాగర్ జలాల సరఫరా కొనసాగించాలని రైతుల విజ్ఞప్తి చేశారు.