మిర్యాలగూడ: మిర్యాలగూడలో గుండెపోటు తో హెడ్ కానిస్టేబుల్ మృతి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సందర్భంగా బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నజీరుద్దీన్(45), తెల్లవారుజామున అనారోగ్యంకి గురి కావడంతో పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆసుపత్రికి చేరుకున్న పలువురు పోలీస్ అధికారులు వ్యక్తం చేశారు.