చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు తిరుమల డైరీ నుంచి శంకర్ రాయలపేటకు వెళ్లే మార్గంలో ఎరువులు వెళ్తున్న టిప్పర్ను ఢీకొని బంగారుపాళ్యం మండలం మూట బంక గ్రామానికి చెందిన గోపి తీవ్రంగా గాయపడ్డాడు స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.