భీమవరం: దగ్గులూరులో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల వద్ద ఈ నెల 19న ఆందోళన చేపడతాం : వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సందీప్
పాలకొల్లు నియోజకవర్గంలోని దగ్గులూరులో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల వద్ద ఈ నెల 19న ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నామని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సందీప్ తెలిపారు. బుధవారం రాయలంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని వైసీపీ యువజన విభాగం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.