బడంగ్పేట్ పరిధిలోని ఏజిఆర్ కాలనీలో తీవ్రంగా వేధిస్తున్న డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిష్కరించారు. గురువారం మధ్యాహ్నం ఏజిఆర్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి రావడంతో ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ సరస్వతిని పిలిపించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పై ప్రాంతాల నుంచి మురుగునీరు ప్రవాహం కారణంగా తరచుగా కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రత్యేక డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.