నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల కేంద్రంతో పాటు తంగడంచ గ్రామంలోని పాములపాడు మండల పరిధిలోని రుద్రవరం గ్రామంలో భారీ వర్షం కురిసింది, వర్షం దాటికి రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి,గత వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, పనులు నిమిత్తం వచ్చే ప్రజలు వర్షం దాటికి తడిసి ముద్దయ్యారు, మరోపక్క రైతులు చేతికొచ్చిన మొక్కజొన్న పంటలు దెబ్బతింటాయని అన్నారు.