కేతేపల్లి: కేతేపల్లి మండలంలోని సహకార బ్యాంకు వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు
నల్లగొండ జిల్లా కేతపల్లి మండలంలోని సోమవారం సహకార బ్యాంకు వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ యూరియా సకాలంలో అందించకపోవడంతో పంట చేతికి వచ్చే పరిస్థితి లేకుండా పోతుందన్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందకుండా పోతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో రైతులకు యూరియా అందించడంలో విఫలమయ్యారని అన్నారు.