మేడ్చల్: చిలకనగర్ డివిజన్ లో పార్కుల అభివృద్ధి పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్
చిల్కానగర్ డివిజన్లోని పార్కుల అభివృద్ధి పనులను కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అన్నారు.నార్త్ కళ్యాణపురి లోని పార్కులో స్ట్రీట్ లైట్స్ కి అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను అన్నింటిని వెంటనే తొలగించే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని పార్కులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలాజీ ఇంట్లో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.