ప్రకాశం జిల్లా దొనకొండ కురిచేడు మండలాలను మార్కాపురం జిల్లాలో కలపాలని కాంగ్రెస్ పార్టీ దర్శి ఇన్చార్జి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. కూటమి నాయకులు రాజీనామా చేస్తే వారితో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. రైతులను ఆదుకోవడం కోటమీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వైసిపి నాయకులు నోరు మెదపటం లేదని మండిపడ్డారు.