జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
శనివారం ఎన్టీఆర్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా వి.చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఎస్.డిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి ఏలూరు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ రెడ్డికి కలెక్టర్ డిల్లీరావు శుభాకాంక్షలు తెలియజేశారు.