గుంతకల్లు: పాము కాటు కు గురైన పగిడిరాయి కి చెందిన రైతు దేవేంద్ర, గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలింపు
కర్నూలు జిల్లా పగిడిరాయి గ్రామానికి చెందిన దేవేంద్ర అనే రైతు గురువారం పాముకాటుకు గురయ్యాడు. గ్రామంలోని హోటల్ వద్దకు టీ తాగడానికి వెళ్తుండగా కాలుకు పాము కాటు వేసింది. స్థానికులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు దేవేంద్ర ను గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే వైద్యం చేశారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.