ప్రొద్దుటూరు: మెప్మా టిఈ మహాలక్ష్మి అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్
Proddatur, YSR | Sep 17, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం చైర్మన్ ఛాంబర్ నందుఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారం మునిరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు విభాగంలో అవినీతి అనకొండ టీఈ మహాలక్ష్మి పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టి మహాలక్ష్మి ద్వారా డ్వాక్రా ఆర్పీలు, సిఈఓ లకు టార్గెట్లు పెట్టి ఆదాయం పొందుతున్నారు. మెప్మా బజార్ల పేరుతో ఆన్లైన్లో నాసిరకం ఉత్పత్తులను కొనుగోలు చేయించి లక్షల రూపాయలు అర్జస్తున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు ముని రెడ్డి ఆరోపించారు. మెప్మా టి ఈ మహాలక్ష్మి పై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.