మార్కాపురం జిల్లా కేంద్రం శివారు ప్రాంతంలోని ఓ డ్రైవింగ్ స్కూలుకు సంబంధించిన లారీ మంటల్లో దగ్ధం అయిపోయింది. ఈ సంఘటనపై డ్రైవింగ్ స్కూల్ ప్రతినిధులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సుమారు రెండు లక్షలు మేర నష్టం జరిగిందని వారు వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు ప్రమాద సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి దర్యాప్తు చేపడుతున్నామన్నారు.