పెనుకొండ జైలులో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించిన పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పెనుకొండ సబ్ జైలులో రిమాండ్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించారు. కొత్తచెరువు, పోతులకుంట, బుక్కపట్నం ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది నాయకులపై తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉండి, త్వరలోనే వారి విడుదలకు కృషి చేస్తామని శ్రీధర్రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.