దర్శి: రాజంపల్లి లో భారీ వర్షానికి ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు రవణమ్మ
Darsi, Prakasam | Sep 16, 2025 ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో కురిసిన వర్షానికి యన్నాబత్తిని రవణమ్మ సిమెంటు రేకులతో ఉన్న ఇంటి పై కప్పు కూలిపోయింది. గతంలో కురిసిన వర్షానికి కొంత భాగం దెబ్బతిన్నదని మంగళవారం కురిసిన వర్షానికి పూర్తిగా పైకప్పు కూలిపోయిందని రవణమ్మ తెలిపారు. దీంతో ఉండడానికి నీడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.