ఆందోల్: ధర్మపుర్ లో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా పశువైద్యాధికారి
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని ధర్మపూర్ గ్రామంలో మంగళవారం, పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా పశువైద్యాధికారి పిజిఎస్ పాండ్యన్ నేతృత్వంలో 94 పశువులకు టీకాలు వేశారు. జిల్లా ఇంచార్జి పశువైద్యాధికారి ఆదిత్యవర్మ ఈ కార్యక్రమాన్ని సందర్శించి, రైతులను తమ పశువులకు టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి పిజిఎస్ పాండ్యన్, సిబ్బంది, పశువుల యజమానులు పాల్గొన్నారు.