తొలి ఏకాదశి పురస్కరించుకొని నిర్మల్ పట్టణంలోని చింతకుంట వాడ కాలనీలో గల విఠలేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తులుప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ వార్డుల నుండి ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేశారు.