వాంకిడి మండలం బంబారాకి చెందిన నీలం శ్రీలత (31) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వాంకిడి ఎస్ఐ మహేందర్ కథనం మేరకు..శ్రీలతకు జైపూర్(M) కిష్టాపూర్ కి చెందిన రంజిత్ తో పెళ్లి కుదిరింది.కానీ రంజిత్ విషం త్రాగి ఆత్మహత్య చేసుకొన్నాడు.కాబోయే భర్త మరణాన్ని జీర్ణించుకోలేక శ్రీలత జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంట్లో దులానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. మృతురాలి తల్లి నీలం సత్తమ్మ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.