గుంతకల్లు: గుత్తిలో ఒకేరోజు ముగ్గురికి డెంగ్యూ జ్వరం, వైరల్ ఫీవర్ రోగులతో ఆసుపత్రి కిట కిట
గుత్తి పట్టణంలో సోమవారం ఒక్కరోజే ముగ్గురు డెంగ్యూ జ్వరానికి గురయ్యారు. గుత్తి పట్టణానికి చెందిన వెంకటకృష్ణ (10), షణ్ముఖ (16), ముస్తాక్ (5) డెంగ్యూ వ్యాధికి గురయ్యారు. ఆస్పత్రిలో ముగ్గురు అడ్మిట్ అయ్యారు. వైద్యులు వైద్య సేవలు చేస్తున్నారు. రెండు రోజులు పాటు ఆసుపత్రుల్లోనే ఉండాలని వైద్యులు సూచించారు. డెంగ్యూ జ్వరంతోపాటు వైరల్ ఫీవర్ కూడా అధికంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వైరల్ ఫీవర్ తో రోగులు ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. ఆస్పత్రి రోగులతో నిండిపోయింది.