మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పట్టణంలో వైకాపా నాయకులు ర్యాలీ చేపట్టారు
శ్రీకాళహస్తిలో వైసీపీ నాయకుల ర్యాలీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ శ్రీకాళహస్తిలో వైసీపీ నాయకులు బుధవారం ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీవో ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. కార్యాలయంలోని ఇన్ఛార్జ్ అధికారికి వినతిపత్రం అందజేశారు. డాక్టర్లు కావాలని కలలుకనే పేద విద్యార్థుల ఆశలకు చంద్రబాబు గండి కొట్టారని విమర్శించారు.