ఆదోని: ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజుకు ఎలాంటి షరతులు లేకుండా ఫీజు కట్టించుకోవాలి : డి ఎస్ ఎఫ్
Adoni, Kurnool | Oct 7, 2025 ఆదోని పట్టణంలోని ఆర్సన్ సైన్స్ కళాశాలలో విద్యార్థులకు కళాశాల ఫీజుకు సంబంధం లేకుండా, ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు కట్టించుకోవాలని, డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు దానాపురం ఉదయ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు కట్టాలంటే కళాశాల ఫీజు కట్టాలి అని చెప్పడం సరైన పద్ధతి కాదని వారన్నారు. విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు.