మేడ్చల్: నాచారం ఇండస్ట్రియల్ ఏరియా లో రోడ్డు ప్రమాదం
నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో రోడ్డు ప్రమాదం చేసుకుంది. డీసీఎంఓ యాక్టివా ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద వెళుతున్న ఇద్దరికీ గాయాలు అయ్యాయి. డీసీఎం డ్రైవర్ ప్రమాదానికి కారణమని నాచారం పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. సిసి ఫుటేజ్ సహాయంతో పిసి వెంకటేష్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదయింది. డీసీఎం డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడంలో చొరవ చూపిన వెంకటేశుకు సీఐ ధనుంజయ రివార్డు అందజేశారు.