కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు : టూ టౌన్ సిఐ నెట్టికంటయ్య
Chittoor Urban, Chittoor | Nov 4, 2025
బుధవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు టూ టౌన్ సిఐనిటికంటే తెలిపారు మంగళవారం రాత్రి ఆయన తన సిబ్బందితో కలిసి స్థానిక ఆలయాలను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు. నీవా నది సమీపంలోని రాజుకుడి శివాలయం అగస్తీశ్వర స్వామి దేవాలయం ఇరువారం శివాలయం దుర్గా నగర్ కాలనీలోని అమ్మవారి ఆలయాలు తదితర ఆలయాలను ఆయన సందర్శించే సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.