తాడిపత్రి: తాడిపత్రిలో ఎమ్మెల్యే జే సీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి వేడుకలు
తాడిపత్రి పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాలవేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అబుల్ కలాం ఆజాద్ ను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.