వందేమాతర గేయం రచించి 150 సం. పూర్తి చేసుకున్న సందర్భంగా కలికిరిలో అవగాహన ర్యాలీ మానవహారం
వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా కలికిరిలో పోలీస్ సిబ్బంది మరియు ఆదీస్ ఇండియన్ హైస్కూల్ విద్యార్థులతో శుక్రవారం అవగాహన ర్యాలీ మానవహారం నిర్వహించారు. ఈ ర్యాలీ కలికిరి పోలీస్ స్టేషన్ నుంచి క్రాస్ రోడ్ నాలుగు రోడ్ల కూడలి వరకు సాగింది అనంతరం మానవహారం నిర్వహించి వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాల అయిన సందర్భంగా జాతీయ నాయకులను స్మరించుకుంటూ వందేమాతరం గీతం ఆలపించారు. అదే విధంగా వందేమాతరం గేయ రచయిత బంకించంద్ర ఛటర్జీ గురించి, దేశభక్తి గురించి స్కూల్ విద్యార్థులకు వివరించారు.