కొవ్వూరు: కోవూరులో బైక్ చోరీ.. లైవ్ వీడియో
బైక్ చోరీ.. లైవ్ వీడియో నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్దపడుగుపాడులో బైక్ చోరీకి గురైంది. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు మంకీ టోపీ ధరించి శీరం రాధాకృష్ణ ఇంట్లోకి ప్రవేశించారు. పార్కింగ్ చేసి ఉన్న AP39EC5146 నంబర్ గల బైక్ అపహరించారు. సంబంధిత దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఉదయం బైక్ కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.