పొదలకూరు నుండి నావూరు, చెన్నారెడ్డి పల్లి, బోగ సముద్రం వెళ్ళే రహదారిపై నావూరు పెద్ద వాగు పొంగి పొర్లి, ప్రవహిస్తూ వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని తెలిసిన వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత ఘటనా స్థలానికి వెళ్లారు. ముంపు ప్రాంతాల రహదారులలో దారి మళ్లింపు చేయడం జరుగుతుందనీ..ప్రజలు సహకరించాలని సూచించారు. అనంతరం పొదలకూరు సర్కిల్ ఆఫీసును సందర్శించి, సర్కిల్ ఆఫీస్ మ్యాప్, పరిధులు, హైవేలు, వాగులు, వంకలు ఉన్న ప్రదేశాలు, కండలేరు డ్యాం గురించి, కలువాయి వెళ్ళే మార్గం, పెన్నా పరివాహక ప్రాంతం గురించి ఆరా తీశారు..