పరిగిలో ఉర్దూ పాఠశాల చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు
శ్రీ సత్య సాయి జిల్లా పరిగిలో ప్రశాంతి నగర్లో ఉన్న ఉర్దూ ప్రాథమిక పాఠశాల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో పాఠశాలకు వెళ్లడానికి విద్యార్థులు భయపడుతున్నారని గురువారం మధ్యాహ్నం స్థానికులు తెలిపారు. గడ్డి మొక్కలు పెరిగి పాములు, తేళ్లు తిరుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, అధికారులు స్పందించి పిచ్చి మొక్కలు తొలగించాలని కోరారు.