సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ,నవంబర్ 1న హైదరాబాద్లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు కేశవరావు అన్నారు. ఆదివారం సాయంత్రం రెబ్బెన లో ఆయన మాట్లాడుతూ..సీజేఐ గవాయి మీద దాడి దళితుల హృదయాలను గాయపరిచింది. ఆయన దళితుడిగా ఉన్నందునే కొంతమంది దళిత వ్యతిరేకులు ఈ దాడికి పాల్పడ్డారు. గవాయి స్థానంలో ఉన్నత వర్గాలకు చెందిన న్యాయమూర్తి ఉన్నా ఈ దాడి జరిగి ఉండేది కాదు. ఇది కేవలం వ్యక్తిపై కాదు రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై,దళితుల ఆత్మగౌరవంపై దాడి అని మండిపడ్డారు.