గోరంట్ల బాలుర పాఠశాలల్లో డైరీలు పంపిణీ
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం మధ్యాహ్నం కూటమి నాయకులు డైరీలు పంపిణీ చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశాల మేరకు విద్యార్థులకు ఈ డైరీలు పంపిణీ చేసినట్లు చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో మండలంలోని కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.