మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదినం సందర్భంగా వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామంలో అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో చిరకాలం సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా పూజ కార్యక్రమం జరిపించాలని బుడ్డా శేషారెడ్డి తెలియజేశారు, అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు అభిమానులు నాయకులు కార్యకర్తలు తినిపించుకొని శుభాకాంక్షలు తెలిపారు, అనంతరం బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు,