సంగారెడ్డి: బీసీ జెఎసి కారణంగా బస్టాండ్ కి పరిమితమైన బస్సులు, ప్రైవేటు వాహనాలలో బయలుదేరిన ప్రయాణికులు
బిసి జేఏసీ సమ్మె కారణంగా సంగారెడ్డి డిపో నుంచి ఆర్టీసీ బస్సులు శనివారం బయటకు రాలేదు. కొత్త బస్టాండ్ వద్ద నాయకులు ఆందోళన చేయడంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీనితో ప్రయాణికులు లేక బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. బస్టాండ్‌కు వచ్చిన కొందరు ప్రయాణికులు బస్సులు రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు