నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి చికిత్స పొందుతు మృతి
Anantapur Urban, Anantapur | Sep 16, 2025
అనంతపురం నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కర్నూలు జిల్లా హాలాహర్వి మండలం చిరుగాపురం గ్రామానికి చెందిన వడ్డే రాముడు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈనెల 11వ తేదీన అతనిని వారి కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.