గిద్దలూరు: అర్ధవీడులో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని: వెంటనే వారి సమస్య పరిష్కరించాలన్న వైసీపీ ఇన్చార్జ్ నాగార్జున రెడ్డి
మంతా తుఫాను కారణంగా అర్ధవీడు మండల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని స్థానిక వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన నాగార్జున రెడ్డి అర్ధవీడు మండలంలోని 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని ఇంకా వరద ఉధృతి తగ్గేందుకు పది రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. గతంలో సీఎం గా జగనన్న సమయంలో ఒక రాస్తాను సిద్ధం చేయడం జరిగిందని దాన్ని మరింత అభివృద్ధి చేస్తే ఆ గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుందని కుందూరు నాగార్జున రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.