గండీడ్: గండేడ్ మండల ఓటర్ లిస్ట్ విడుదల చేసిన ఎంపీడీవో దేవన్న
గండీడ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దేవన్న ఉమ్మడి మండలాల నూతన ఓటర్ జాబితా ముసాయిదాను శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నూతన ఓటర్ లిస్టులను ప్రతి గ్రామానికి చేరవేయాలని తెలిపిందని పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శుల ద్వారా ప్రతి గ్రామానికి పంపిణీ చేశామన్నారు. జిల్లా స్థాయిలోను నూతన లిస్టును విడుదల చేస్తారని, అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు.