నల్లకుంట హత్య కేసులో నిందితుడిని 36 గంటల్లోనే అరెస్టు చేసినట్లు అడిషనల్ DCP నర్సయ్య తెలిపారు. 'పెళ్లి అయిన తర్వాత భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. 23వ తేదీన రాత్రి మద్యం తాగిన తర్వాత దగ్గరలోని బంక్ నుంచి పెట్రోల్ తీసుకొచ్చాడు. నిద్రిస్తున్న త్రివేణి మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. గాంధీకి తీసుకెళ్లగా.. ఆమె అరగంటలోనే చనిపోయింది. నిందితుడికి శిక్ష పడేలా చర్యలు ఉంటాయి' అని DCP వెల్లడించారు.