నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో గురువారం మోస్తారు వర్షం పడింది. ఎండ వేడిమి కి ఇబ్బందులు పడ్డ ప్రజలు వర్షానికి కాస్త ఉపశమనం పొందారు. మరో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.