మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సేవలు స్ఫూర్తిదాయకం కావాలి :జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్
Nandyal Urban, Nandyal | Nov 11, 2025
భారతదేశ అభివృద్ధికి పునాదివేసిన మహనీయులు స్వాతంత్ర సమరయోధులు భారత తొలి విద్యామంత్రి భారతరత్న మూలాన అబ్దుల్ కలాం ఆజాద్ సేవలు ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్ అన్నారు .ఆయన జయంతి సందర్భంగా మంగళవారం నంద్యాల పట్టణంలో మునిసిపల్ ఇండోర్ స్టేడియంలో మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ,మైనారిటీ నాయకులు పాల్గొన్నారు