నెల్లూరులో స్వచ్ఛత హీ సేవ - 2025 అవగాహన ర్యాలీ నిర్వహించిన అధికారులు
17 వ తేదీ నుంచి అక్టోబర్ నెల 2 వ తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛత హీ సేవ - 2025 కు సంభందించి వివిధ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం స్థానిక వి.ఆర్.సి మైదానం నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీని చేపట్టారు. ర్యాలీని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ జెండాను ఊపి ప్రారంభించి అందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజలందరూ బాధ్యత పెంచుకోవాలని ఆకాంక్షించారు.