రేణిగుంట పాత చెక్పోస్ట్ రైల్వే వంతెన వద్ద కాలువ లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
గుర్తుతెలియని మృతదేహం లభ్యం రేణిగుంట పాత చెకోపోస్ట్ నుంచి అంకమనాయుడుమిట్ట గ్రామానికి వెళ్లే మార్గంలో రైల్వే వంతెన వద్ద మురికి కాల్వలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వయస్సు సుమారు 35-40, ఎత్తు 5.8 అడుగులు, చామన చాయ, నలుపు షర్ట్, ప్యాంట్ ధరించి ఉన్నాడు. నీటిలో ఎక్కువ సేపు ఉండటంతో గుర్తుపట్టలేని స్థితిలో డెడ్ బాడీ ఉందని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని వారు కోరారు.