కైకలూరు ఘర్షణలు నేపథ్యంలో జనసేన నేత కొల్లి ప్రసాద్ ను అరెస్టు చేసిన పోలీసులు
Eluru Urban, Eluru | Sep 16, 2025
ఈనెల ఐదో తేదీన కైకలూరు పట్టణంలోని దానగూడెంలో దళితులపై జరిగిన దాడి ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది నిందితులను ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. దాడిలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కుంటున్న కొల్లి వీర వెంకట వరప్రసాద్ అలియాస్ బాబిను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని వైద్య పరీక్షలు నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు.